Godavari Floods: మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..

Godavari Floods: మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..

Anil kumar poka

|

Updated on: Sep 07, 2024 | 1:11 PM

వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. పై నుంచి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ ను దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. పై నుంచి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ ను దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తుంటే.. గోదావరి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తెలంగాణ – చత్తీస్‌గడ్‌ మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఇటు నిజామాబాద్‌ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు కందకుర్తిలో వరద పరవళ్లు తొక్కుతోంది. కందకుర్తిలో అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే నీళ్లు బ్రిడ్జి పైనుంచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే మరో 10 గంటల్లో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ములుగు జిల్లా టేకులగూడెం దగ్గర కూడా గోదావరికి వరద పోటెత్తింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.