Smartphone: గ్యాప్ లేకుండా గేమ్స్.. చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. వీడియో.
కేరళలోని త్రిశూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ పేలి చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన త్రిశూర్‌లోని తిరువిల్వామలలో వెలుగు చూసింది. చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది.
కేరళలోని త్రిశూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ పేలి చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన త్రిశూర్‌లోని తిరువిల్వామలలో వెలుగు చూసింది. చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో పత్తిపరంబుకు చెందిన ఆదిత్యశ్రీ అనే 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గ్యాప్ లేకుండా గేమ్స్ ఆడుతుండటంతో ఫోన్ హీటెక్కినట్లు భావిస్తున్నారు. ఎండాకాలం కావడంతో హీట్ పెరిగి ఫోన్ పేలింది. చిన్నారి ఆదిత్యశ్రీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవిగా మారిన చిన్నారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదిత్యశ్రీ తిరువిల్వామలలోని క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్‌లో మూడోవ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై పజ్యన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం, ఫోన్ మాట్లాడటం, ఫోన్ హీటెక్కినప్పుడు వినియోగించడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!