తోటలో పనిచేసుకుంటున్న రైతు.. పొదల మధ్య సీన్ చూసి షాక్
విజయనగరం జిల్లా బొద్దాం గ్రామంలో రైతు సింహాచలం తన పొలంలో పని చేస్తుండగా 12 అడుగుల భారీ కొండచిలువను చూసి షాక్ తిన్నాడు. మొదట అలసత్వం వహించినా, కదలికలు పెరగడంతో దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ దృశ్యంతో భయపడి పరుగందుకున్నాడు. గ్రామస్తులు అటవీశాఖకు సమాచారం ఇవ్వగా, స్నేక్ క్యాచర్ శేఖర్ దాన్ని సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టాడు.
ఓ రైతు రోజూలాగే తన తోటలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ తోటలోని పొదల్లో అతనికి ఏదో అలికిడి వినిపించింది. మొదట లైట్ తీసుకున్న అతను తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కదలికలు ఎక్కువవడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశాడు. దెబ్బకు గుండె గుబేల్ మంది. వెంటనే అక్కడినుంచి పరుగందుకున్నాడు. విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన రైతు సింహాచలం తన తోటలో రోజువారీ పని చేస్తుండగా పొదల నుంచి అకస్మాత్తుగా కదలికలు గమనించాడు. మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నాడు. కానీ అది పొదల మధ్య నుండి పొలంలోకి రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. సుమారు 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ తోటలో నెమ్మదిగా సంచరిస్తుండటం గమనించాడు. సింహాచలం వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపట్లోనే అక్కడికి చేరిన రైతులు, పొలాల్లో పని చేస్తూ అటుగా వెళ్తున్న మహిళలు, కొండచిలువను చూసి ఆశ్చర్యపోయారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే స్నేక్ క్యాచర్ శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని తన వద్ద ఉన్న ప్రత్యేకమైన పరికరాల సహాయంతో కొండచిలువను జాగ్రత్తగా బంధించాడు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువను పట్టుకున్న అనంతరం స్నేక్ క్యాచర్ శేఖర్ సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
iBomma: ఐ బొమ్మ రవికి ఎలాంటి దారుణ శిక్ష పడబోతుందో తెలుసా ??
Manchu Lakshmi: మంచు లక్ష్మికి లైంగిక వేధింపులు
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

