ఎయిర్ షోలో కుప్పకూలిన యుద్ధ విమానం !!
దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్ షోలో భారత్ తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ప్రదర్శన జరుగుతుండగా అల్ మక్తూమ్ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీగా నల్లటి పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. ఇది తేజస్ విమానం రెండవ ప్రమాదం, ఈ ఘటన ఏవియేషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
దుబాయ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన నల్లటి పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడా..? లేదా..? అన్నది స్పష్టంగా తెలియలేదు. కానీ, ప్రమాద తీవ్రతను చూస్తుంటే పైలట్ బతికే ఛాన్స్ లేదనే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందూస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసింది. తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. తొలిసారిగా 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది. అయితే, ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయ్యారు. తేజస్ చరిత్రలో అదే మొదటి ప్రమాదం. తేజస్ 4.5వ తరం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇందులో పైలట్ సురక్షితంగా బయటపడేందుకు ‘జీరో-జీరో’ ఎజెక్షన్ సీటు వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

