AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: షోరూం సమీప ప్రాంతం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. వామ్మో..

Warangal: షోరూం సమీప ప్రాంతం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. వామ్మో..

Ram Naramaneni
|

Updated on: Nov 22, 2025 | 10:52 AM

Share

వరంగల్ బట్టుపల్లి రోడ్ ప్రాంతంలో 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించడం హల్‌చల్ సృష్టించింది. అమ్మవారిపేట క్రాస్ రోడ్ సమీపంలోని ఓ షోరూమ్ వద్ద కోతిని మింగి కదలలేని స్థితిలో పడిఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది...

వరంగల్ నగరంలో బట్టుపల్లి రోడ్‌ ప్రాంతంలో శనివారం ఒక భారీ కొండచిలువ కారణంగా కలకలం చెలరేగింది. అమ్మవారిపేట క్రాస్‌ రోడ్ సమీపంలోని ఓ షోరూమ్ వద్ద సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడం స్థానికుల్లో భయాందోళనలకు దారితీసింది. అది కదలలేక ఒకచోటే పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. దగ్గరికి వెళ్లి చూశాక పరిస్థితి మరింత స్పష్టమైంది. కొద్దిసేపటికి ముందు అది ఒక కోతిని మింగేసి.. ఎటూ వెళ్లలేకపోతున్నట్లు గుర్తించారు. విషయం తెలియడంతో మరికొంతమంది ఆ ప్రాంతంలో గుమిగూడారు. దీంతో స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఫారెస్ట్‌ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో సుమారు ఒక గంట పాటు చేసిన శ్రమ తర్వాత కొండచిలువను విజయవంతంగా పట్టుకున్నారు. తర్వాత ఆ సర్పాన్ని సురక్షితంగా వరంగల్ వన విజ్ఞాన కేంద్రానికి తరలించారు. ప్రమాదం లేకుండా రక్షణ చర్యలు తీసుకున్న ఫారెస్ట్‌ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Published on: Nov 22, 2025 10:51 AM