విమానంలో నిలిచిపోయిన ఆక్సిజన్.. ఫుట్‌బాల్ జట్టుకు తప్పిన ప్రమాదం
గాంబియా ఫుట్‌బాల్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (Africa Cup Of Nations)లో పాల్గొనేందుకు విమానంలో బయలు దేరిన ఆ జట్టు సభ్యులు తృటిలో పెను ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఐవరీ కోస్ట్ (Ivary Coast) వెళ్లేందుకు గాంబియా ఫుట్‌బాల్ టీమ్ ఎక్కిన విమానంలో అనుకోకుండా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో, భయానికి గురైన ఆటగాళ్లు ప్రాణ భయంతో కొట్టుమిట్టాడిపోయారు.
గాంబియా ఫుట్‌బాల్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (Africa Cup Of Nations)లో పాల్గొనేందుకు విమానంలో బయలు దేరిన ఆ జట్టు సభ్యులు తృటిలో పెను ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఐవరీ కోస్ట్ (Ivary Coast) వెళ్లేందుకు గాంబియా ఫుట్‌బాల్ టీమ్ ఎక్కిన విమానంలో అనుకోకుండా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో, భయానికి గురైన ఆటగాళ్లు ప్రాణ భయంతో కొట్టుమిట్టాడిపోయారు. అయితే.. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్‌లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాంతో, ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కొంచెం సేపటికే అధికారులు మరో విమానం ఏర్పాటు చేయడంతో గాంబియా జట్టు ఐవరీ కోస్ట్‌కు బయలేదేరింది. ఈ సంఘటన అనంతరం గాంబియా ఫుట్‌బాలర్ సాడీ జన్కో(Saidy Janko) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టారు. అందులో ఆక్సిజన్ నిలిచిపోవడంతో కొందరికీ విపరీతంగా చెమటలు పట్టాయని, మరికొందరు భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారని పేర్కొన్నారు. జనవరి 13 నుంచి మొదలయ్యే ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో మొత్తం 24 జట్లు పాల్గొననున్నాయి. వీటిని ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. 2 వేలమందికి ఫ్రీ ఎంట్రీ
మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా ?? అయితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలుసా ??
కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సందడిగా వేడుకలు