అయోధ్య రామునికి 44 క్వింటాళ్ల నేతి లడ్డూల కానుక
ఏనోట విన్నా రామనామమే.. ఏ చోట చూసినా అయోధ్యపై చర్చే.. అయోధ్యరాముడు ఆలయంలో ఇంకా ప్రతిష్ట కాలేదు కానీ.. ఆ దివ్యమంగళస్వరూపం మాత్రం దేశవ్యాప్తంగా అందరి మదిలో నిండిపోయింది. ఎక్కడ చూసినా రామునిగురించి చర్చే... ఓ వైపు సంక్రాంతి సంబరాలు..మరోవైపు అయోధ్యరాముని ప్రతిష్టాపన...ఆలయ ప్రారంభం.. ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రామయ్యకు దేశం నలుమూలలనుంచి పెద్ద ఎత్తున కానుకలు వెల్లువెత్తుతున్నాయి.
ఏనోట విన్నా రామనామమే.. ఏ చోట చూసినా అయోధ్యపై చర్చే.. అయోధ్యరాముడు ఆలయంలో ఇంకా ప్రతిష్ట కాలేదు కానీ.. ఆ దివ్యమంగళస్వరూపం మాత్రం దేశవ్యాప్తంగా అందరి మదిలో నిండిపోయింది. ఎక్కడ చూసినా రామునిగురించి చర్చే… ఓ వైపు సంక్రాంతి సంబరాలు..మరోవైపు అయోధ్యరాముని ప్రతిష్టాపన…ఆలయ ప్రారంభం.. ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రామయ్యకు దేశం నలుమూలలనుంచి పెద్ద ఎత్తున కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామయ్యకు నేపాల్ జనకపూర్ అత్తవారింటినుంచి స్పెషల్ స్వీట్స్, వెండి బాణం కానుకలుగా వచ్చి చేరాయి. మరోవైపు తిరుమల శ్రీనివాసుడు కూడా లక్ష లడ్డూలు పంపిస్తున్నాడు.. ఇప్పుడు మరో భక్తుడు రాములోరికి స్వచ్ఛమైన నేతి లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు దేవ్రహా బాబా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: