రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల నుంచీ భక్తులు ఈ వేడుకకు రానున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రామయ్య సన్నిధికి చేరుకుంటారు. వీరి ఇబ్బందులను గుర్తించిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వెళ్లే వారి కోసం ఉచిత రైలును ప్రకటించింది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల నుంచీ భక్తులు ఈ వేడుకకు రానున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రామయ్య సన్నిధికి చేరుకుంటారు. వీరి ఇబ్బందులను గుర్తించిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వెళ్లే వారి కోసం ఉచిత రైలును ప్రకటించింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు ద్వారా 20 వేల మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోనున్నారు. 18 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల వారు వైద్యపరంగా ఫిట్‌నెస్ ధ్రువపత్రం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. మొదటి దశలో 55 ఏళ్లు పైబడిన వారిని ఎంపిక చేస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: