Viral Video: పామునే పడవగా మార్చుకున్న కప్ప, ఎలుకలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇవి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరమైన జంతువులకు సంబంధించినవే.. జంతువుల వీడియోల్లో అవి వేటాడటం మనం చూస్తూ ఉంటాం.. అయితే కొన్ని జంతువులు జాతివైరం...
ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇవి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరమైన జంతువులకు సంబంధించినవే.. జంతువుల వీడియోల్లో అవి వేటాడటం మనం చూస్తూ ఉంటాం.. అయితే కొన్ని జంతువులు జాతివైరం మరిచి స్నేహంగా మెలగడం మనకు తెలిసిందే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా పాములు.. ఎలుకలు కప్పలులాంటివి కనిపిస్తే అస్సలు వదలవు.. అమాంతం మింగేస్తాయి. కానీ వీడియోలో మాత్రం అలా జరగలేదు. ఒకేసారి ఎలుకలు, కప్ప చిక్కినప్పటికీ పాము చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.నెట్టింట్లో కనిపించిన ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము ఒక కప్పను, రెండు ఎలుకలను తన వీపు పైన కుర్చోబెట్టుకొని సవారీ చేస్తుంది. ఒక ప్రాంతంలో భారీ వర్షం కారణంగా, ఒక పాము, ఒక కప్ప మరియు రెండు ఎలుకలు కంటైనర్‌లో చిక్కుకున్నాయి. పాము కావాలనుకుంటే ఆ కప్పను,ఎలుకలను ఆహారంగా మార్చుకోవచ్చు.. కానీ ఆ పాము కంటైనర్‌లో నిండిన నీటి నుండి కప్ప, ఎలుకలప్రాణాలు రక్షించింది. నీటిలో మునిగి పోకుండా వాటిని వీపు పై కుర్చోబెట్టుకుంది… కానీ వాటికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఈవీడియో పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఆశ్చర్యకరమైన వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)