Viral Video: నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!

Viral Video: నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!

Anil kumar poka

|

Updated on: Jun 15, 2024 | 3:39 PM

కొందరు చిన్నారు నెలల వయసులో అద్భుతమైన గ్రాస్పింగ్‌ పవర్‌ ప్రదర్శిస్తారు. ఏదైనా ఒక్కసారి చెబితే ఇట్టే గ్రహించడమే కాకుండా దానిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం.. గుర్తించడం కూడా చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి చిన్నారులు చాలామంది గురించి నెట్టింట చూశాం. వారికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లాంటి వారు గుర్తించి సత్కరించారు కూడా.

కొందరు చిన్నారు నెలల వయసులో అద్భుతమైన గ్రాస్పింగ్‌ పవర్‌ ప్రదర్శిస్తారు. ఏదైనా ఒక్కసారి చెబితే ఇట్టే గ్రహించడమే కాకుండా దానిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం.. గుర్తించడం కూడా చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి చిన్నారులు చాలామంది గురించి నెట్టింట చూశాం. వారికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లాంటి వారు గుర్తించి సత్కరించారు కూడా. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన నాలుగు నెలల చిన్నారి అరుదైన రికార్డు సాధించింది. నాలుగు నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను… అంటే ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులను… పండ్లను అలవోకగా గుర్తుపట్టేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గుంతకల్లు పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి సుధాకర్, సింధు దంపతుల నాలుగు నెలల పాప క్రిస్టినా సియారా ఫ్లాష్ కార్డులను గుర్తించడంలో అతిపిన్న వయసు గల చిన్నారిగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. జూన్‌ ఏడవ తేదీన ఆన్‌ లైన్‌లో చిన్నారి ఫ్లాష్ కార్డులను గుర్తించడాన్ని వీక్షించిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు… చిన్నారి క్రిస్టినా సియారాకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందించారు. గతంలో కర్ణాటక కు చెందిన ఓ చిన్నారి కూడా 125 ఫ్లాష్ కార్డులను గుర్తించి రికార్డు సృష్టిస్తే…. నాలుగు నెలల చిన్నారి క్రిస్టినా 149 ఫ్లాష్ కార్డులను గుర్తించి రికార్డు బ్రేక్ చేసింది. నాలుగు నెలల చిన్నారి క్రిస్టినా సాధించిన రికార్డు తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చిన్నారి తల్లిదండ్రులను అభినందించారు. చిన్నారికి ఎంతో ప్రతిభ ఉందని కొనియాడారు. చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు సైతం చిన్నారికి ఆశీర్వదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.