Criminal Reward: ఈ క్రిమినల్ ఆచూకి తెలిపిన వారికి.. రూ. 2లక్షలకు పైగా పారితోషకం..!
న్యూయర్క్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 52 ఏళ్ల వయస్సు ఉన్న మహిళను అనుసరిస్తూ... ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్‌వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు.
న్యూయర్క్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 52 ఏళ్ల వయస్సు ఉన్న మహిళను అనుసరిస్తూ… ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్‌వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు. దీంతో ఆమె స్టేషన్ పేవ్‌మెంట్‌కి గుద్దుకుని సబ్‌వే ట్రాక్‌లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు వెంటనే స్పందించి బాధిత మహిళకు సాయం అందించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇలా తోసేసిన సమయంలో ట్రైన్ రాలేదు కాబట్టి పెనుప్రమాదం తప్పింది. అయితే అతడు ఇలా ఎందుకు ప్రవర్తించాడన్న విషయం తెలియదు కానీ.. ఆమెను ట్రాక్‌పై తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.పాపం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు 2లక్షల పారితోషకం ఇస్తామని ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

