విమానంలో అద్భుతమైన ఘట్టం.. 30 ఏళ్ల తర్వాత..
కెనడాలోని జెట్ సీఎస్‌ఏ విమానంలో లోరీ అనే ఒక ఫ్లైట్ అటెండెంట్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలిని చూసింది.
కెనడాలోని జెట్ సీఎస్‌ఏ విమానంలో లోరీ అనే ఒక ఫ్లైట్ అటెండెంట్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలిని చూసింది. దీంతో పట్టరాని ఆనందంతో విమానంలోని మైక్రోఫోన్ తీసుకొని ప్రయాణికులను ఉద్దేశించి భావోద్వేగంతో తన టీచర్ గురించి చెప్పింది. ”ఈ విమానంలో నా చిన్ననాటి ఉపాధ్యాయురాలు ఉన్నారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆమెను ఇప్పుడే చూసాను. ఆమె నన్ను షేక్స్‌పియర్‌ని ప్రేమించేలా చేసారు, పియానో వాయించేలా చేసారు. అంతేకాదు పియానాలో మాస్టర్స్ చేశాను. ఒక వ్యాసం కూడా రాయగలను. ధన్యవాదాలు ఓకానెల్” అంటూ తన గురువు పేరుని చెపె్పింది. అంతేగాదు చిన్నపిల్లలా ఆనందంతో పరుగెత్తుకుంటూ తన టీచర్ వద్దకు వెళ్లింది. ఈ ఘటన అనుహ్యంగా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజున జరగడం విశేషం. ఈ క్రమంలో సదరు ఎయిర్‌వేస్ కూడా ఇది చాల అద్భుతమైన క్షణం, టీచర్స్ డే రోజునే దీన్ని మాతో పంచుకున్నందుకు లోరీకి ఆమె టీచర్‌కి ధన్యావాదాలు అని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఓ యూజర్ తన ఎన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు కియోనా థ్రాషెర్ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిపేర్ చేసేలోపే పేలిన ఫోన్ !! చివరికి ఏమైందంటే ?? వీడియో వైరల్
మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ !! పొట్ట చీల్చి..
రిషి కుటుంబానికి గోల్డెన్ డేస్.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్ !!