హ్యారీపోటర్ క్రేజ్ ఇంకా తగ్గలేదు.. అధిక ధరకు అమ్ముడైన ఈ బుక్కే సాక్ష్యం !!
హ్యారీ పోటర్ బుక్ మొదటి ఎడిషన్ భారీ ధరకు అమ్ముడుపోయింది. స్టాఫోర్డ్‌షైర్‌లోని లిచ్‌ఫీల్డ్‌లో బుధవారం పుస్తక వేలం జరిగింది. ఈ వేలంలో అరుదైన మొదటి ఎడిషన్ హ్యారీ పోటర్ బుక్ ఏకంగా 36 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది. అంటే భారత కరెన్సీలో రూ.38.50 లక్షలు. 30 ఏళ్ల క్రితం కేవలం 10 పౌండ్లకు కొనుగోలు చేసిన ఆ పుస్తకం తాజా వేలంలో ఏకంగా 36 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది.
క్రిస్టీన్ మెక్‌కల్లోచ్ తన కుమారుడు ఆడమ్ కోసం 1997లో స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ పుస్తక దుకాణం నుంచి ఈ అరుదైన మొదటి ఎడిషన్ కాపీని కొనుగోలు చేశారు. హాన్సన్స్ ఆక్షనీర్స్ ప్రకారం 1997లో తొలిసారిగా బ్రిటిష్ రచయిత జేకే రౌలింగ్ రచించిన ఈ ఫస్ట్ ఎడిషన్ బుక్‌ను కేవలం 500 హార్డ్‌బ్యాక్ కాపీలు మాత్రమే ముద్రించారు. అందులో ఈ పుస్తకం ఒకటి. డెర్బీషైర్‌లోని టాన్‌స్లీకి చెందిన ఆడమ్ మెక్‌కల్లోచ్… ఈ కాపీని తన ఇంటి మెట్ల క్రింద ఉన్న అల్మారాలో భద్రపరిచారు. 2020 లాక్‌డౌన్ సమయంలో ఈ మొదటి ఎడిషన్‌ల విక్రయాల గురించి తెలిసింది. తాజాగా దానిని వేలానికి పెట్టడంతో ఓ బిడ్డర్ 36వేల పౌండ్లు చెల్లించి కొనుగోలు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగోడే.. కానీ పోలీసులకే షాకయ్యే కథ చెప్పాడు..
చెత్త సంచిలో రూ.5900 కోట్లు పడేసిన మహిళ.. చివరికి ??
ట్రంప్ ప్రైవేట్ జెట్.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??