టాయిలెట్‌ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్‌..

|

Jun 07, 2023 | 9:58 AM

ఓ ఉద్యోగి ఆఫీసుకు వచ్చి విధి నిర్వహణ కాకుండా, ఇతర పనులు చేస్తుంటే ఏ కంపెనీ యాజమాన్యానికైనా చిర్రెత్తుకొస్తుంది. చైనాలోని వాంగ్ అనే ఉద్యోగి ఆఫీసుకు వచ్చి గంటల తరబడి టాయిలెట్ లో గడపడంతో యాజమాన్యం మండిపడింది. విధి నిర్వహణ సమయంలో వాంగ్ దాదాపు రోజుకు 6 గంటల పాటు..

ఓ ఉద్యోగి ఆఫీసుకు వచ్చి విధి నిర్వహణ కాకుండా, ఇతర పనులు చేస్తుంటే ఏ కంపెనీ యాజమాన్యానికైనా చిర్రెత్తుకొస్తుంది. చైనాలోని వాంగ్ అనే ఉద్యోగి ఆఫీసుకు వచ్చి గంటల తరబడి టాయిలెట్ లో గడపడంతో యాజమాన్యం మండిపడింది. విధి నిర్వహణ సమయంలో వాంగ్ దాదాపు రోజుకు 6 గంటల పాటు టాయిలెట్ లో గడుపుతున్నట్టు గుర్తించారు. ఒకసారి టాయిలెట్ లోకి వెళ్లాడంటే ఒక్కోసారి 3 గంటల సమయం పాటు బయటికి రాడు. ఇది ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని, సదరు ఉద్యోగిని విధుల్లో కొనసాగించలేమంటూ వేటు వేసింది. దాంతో ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. తనకు మలద్వార సమస్య ఉందని, ఈ కారణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉద్యోగి కోర్టును కోరాడు. అయితే కోర్టు కంపెనీకే మద్దతుగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతూ అధిక సమయం పాటు టాయిలెట్ లో ఉంటే విధి నిర్వహణ కుంటుపడుతుంది కదా అని ఆ ఉద్యోగి తీరు పట్ల కోర్టు వ్యాఖ్యానించింది. విధులు 8 గంటలు అయితే, 6 గంటలు టాయిలెట్లోనే గడిపితే డ్యూటీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించింది. వాంగ్ ఎక్కువసేపు టాయిలెట్లోనే గడపడంపై కంపెనీ తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. దాంతో న్యాయస్థానం ఆ ఉద్యోగికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ కంపెనీలో ఉద్యోగానికి అనర్హుడని తీర్పు ఇచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం

రెంట్ విషయంలో గొడవ.. కోపంమొచ్చిన ఓనర్ ఏ చేసాడంటే ??

దిష్టిబొమ్మ దహనం.. రూ.5 లక్షల జరిమానాతో పాటు నిషేధం

త్వరలో ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ కంపెనీ ?? కొత్త ట్యాలెంట్ కు ప్రోత్సాహం

కలెక్షన్స్‌లలో మెగా రికార్డ్‌ ఇండియాలోనే టాప్‌ 5

 

 

Follow us on