మృతదేహాన్ని కారులో డోర్ డెలివరీ చేసి పరారైన దుండగులు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో 35 ఏళ్ళ ఉప్పు శ్రీను అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు. ఒంటిపై గాయాలతో అనుమానాస్పద స్ధితిలో మృతి చెంది ఇంటి ముందు పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బిత్తరపోయారు.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో 35 ఏళ్ళ ఉప్పు శ్రీను అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు. ఒంటిపై గాయాలతో అనుమానాస్పద స్ధితిలో మృతి చెంది ఇంటి ముందు పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బిత్తరపోయారు. అంతే కాకుండా మృతదేహం పక్కన 35 వేలు ఉంచి దహన సంస్కారాలు చేయడానికి అన్నట్టుగా డబ్బులు ఉంచడంతో గ్రామస్తులు ఎక్కడో చనిపోతే ఇక్కడకు తీసుకొచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. మరోవైపు హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మృతుడు శ్రీను వారం రోజుల క్రితం పనుల నిమిత్తం ఊరు విడిచి వెళ్ళాడు. పనులు పూర్తి చేసుకుని శ్రీను ఇంటికి వస్తాడను కుంటే అతడి శవాన్ని దుప్పట్లో చుట్టి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీలా ఇంటిముందు పడేసి వెళ్ళారు. మృతదేహం పక్కనే 35 వేలు మట్టి ఖర్చుల కోసమంటూ లెటర్ రాసి పెట్టి వెళ్ళిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఉప్పు శ్రీను రెండేళ్ళ నుండి భార్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాయిలెట్ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్..
నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం
రెంట్ విషయంలో గొడవ.. కోపంమొచ్చిన ఓనర్ ఏ చేసాడంటే ??
దిష్టిబొమ్మ దహనం.. రూ.5 లక్షల జరిమానాతో పాటు నిషేధం
త్వరలో ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ కంపెనీ ?? కొత్త ట్యాలెంట్ కు ప్రోత్సాహం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

