Viral Video: బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. వీడియో

Viral Video: బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. వీడియో

Phani CH

|

Updated on: Oct 02, 2021 | 9:47 AM

తమిళనాడు రాజధాని చెన్నైలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. నడి రోడ్డుపైనే ప్రభుత్వ బస్సు తగలబడిపోయింది. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు..వెంటనే బస్సు నుంచి కిందకు దిగేశారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. నడి రోడ్డుపైనే ప్రభుత్వ బస్సు తగలబడిపోయింది. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు..వెంటనే బస్సు నుంచి కిందకు దిగేశారు. దీంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. కోయంబేడు బస్టాండ్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురం నుంచి వస్తున్న బస్సు..మరికొన్ని నిమిషాల్లో కోయంబేడు బస్టాండ్‌కు చేరుకోవడానికి ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపైనే బస్సు తగలబడటంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఏరి కోరి దెయ్యం ఇంటిని కోట్లు పెట్టి కొన్నారు.. వీడియో

Bigg Boss 5: చేతులు జోడించి క్షమాపణ చెప్పిన రవి.. అసలు ఏమైందంటే..?? వీడియో