fake kidnap: కిడ్నాప్ అయ్యానంటూ కాల్ చేసిన మహిళ… చివర్లో అనుకోని ట్విస్ట్..!
ఢిల్లీలో ఓ అమెరికన్ యువతి ప్రియుడితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. తల్లిదండ్రులనే మోసం చేసి డబ్బు కొట్టేసేందుకు కుట్రపన్నింది. చివరికి ఆ మహిళ,
ఢిల్లీలో ఓ అమెరికన్ యువతి ప్రియుడితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. తల్లిదండ్రులనే మోసం చేసి డబ్బు కొట్టేసేందుకు కుట్రపన్నింది. చివరికి ఆ మహిళ, ఆమె ప్రియుడు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. క్లోయ్ మెక్లాఫిన్ తాను కిడ్నాప్‌కి గురయ్యానంటూ తల్లికి ఫోన్ చేసింది. దీంతో ఆమె తల్లి భారత్‌లోని అధికారులను సంప్రదించారు. ఆ తర్వాత యూఎస్ ఎంబసీ ఈ విషయాన్ని న్యూఢిల్లీ పోలీసులకు నివేదించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఆమె తన తల్లికి కాల్ చేసిన వీడియో కాల్‌ని కూడా ట్రాక్ చేయడంతో.. గురుగ్రామ్‌లోని ఒక నైజీరియన్ జాతీయుడి వద్దకు వెళ్లింది. విచారణలో సదరు వ్యక్తి మెకాఫ్లిన్ ప్రియుడని తెలిసింది. బాధిత మహిళ మెకాఫ్లిన్ తన ప్రియుడితో కలసి ఈ కిడ్నాప్ నాటకానికి తెర లేపిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె వద్ద డబ్బులు అయిపోవడంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించారు. వీరిద్దరు ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులయ్యారని, ఒకోరోతో కలిసి ఉండేందుకు ఆమె భారత్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. పాస్‌పోర్ట్‌గానీ, వీసా గానీ లేకుండా ఎక్కువకాలం భారత్‌లోనే ఉన్నందుకు ఇద్దరి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..