Fungal Disease: షాకింగ్ న్యూస్.. విస్తరిస్తున్న.. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు , లక్షణాలు.. పూర్తి వివరాలు.. వీడియో.
భారతీయుల ఆరోగ్యంపై ఆందోళనకరమైన అధ్యయనం ఒకటి తెరపైకి వచ్చింది. ఐదున్నర కోట్ల మంది ఫంగల్ వ్యాధులతో బాధపడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది
భారతీయుల ఆరోగ్యంపై ఆందోళనకరమైన అధ్యయనం ఒకటి తెరపైకి వచ్చింది. ఐదున్నర కోట్ల మంది ఫంగల్ వ్యాధులతో బాధపడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది భారతీయులు టిబితో బాధపడుతున్నారని, ఫంగల్ వ్యాధి బారిన పడిన భారతీయుల సంఖ్య దీని కంటే 10 రెట్లు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. 400కి పైగా పరిశోధనా ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. దేశంలో ఫంగల్ వ్యాధి సర్వసాధారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇది ఏ స్థాయిలో ఉంది..? ఎంత విస్తృతంగా వ్యాపించిందో స్పష్టంగా తెలియలేదు. భారతదేశంలో ఇలాంటి అధ్యయనం జరగడం ఇదే మొదటిసారి.మహిళల యోనిలో యీస్ట్ ఇన్ఫెక్షన్ లేదా పూత, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే క్రానిక్ ఆస్పర్‌గిలోసిస్, అలర్జిక్ లంగ్ మోల్డ్ డిసీజ్, ఫంగల్ కంటి వ్యాధి, ఇంకా ‘బ్లాక్ మోల్డ్’తో లక్షలాది మంది బాధపడుతున్నారట. ఢిల్లీ AIIMS, పశ్చిమ బెంగాల్ AIIMS,చండీగఢ్‌లో PGIMER సహా, UKలోని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..