నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు

Updated on: Mar 10, 2025 | 8:44 PM

పర్యావరణ మార్పులు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా చూస్తున్న భయానక పరిణామం. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది.

అంటార్కిటికా వద్ద మంచు భారీగా ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబద్దీకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు దీని మీదే ఆధారపడి ఉంటుంది. లక్షల ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం.. పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరమైన విషయమే. ఇదిలాగే కొనసాగితే మానవాళి.. ఊహాతీతమైన పర్యావరణ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అధ్యయనం హెచ్చరించింది. పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైంది. అంటార్కిటిక్‌ సర్కం పోలార్‌ కరెంట్‌గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్

స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్‌ కిలాడీ

Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు