Dogs stress: మనుషుల్లో ఒత్తిడిని శునకాలు పసిగడతాయా..? నిజమే అని తేల్చారు పరిశోధకులు.. ఎలా అంటే.. వీడియో

Updated on: Oct 07, 2022 | 10:00 AM

యూకేలోని బెలఫాస్ట్‌ నగరం నుంచి నాలుగు కుక్కలు, 36 మంది మనుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ‘మానవులు ఒత్తిడికి లోనైనప్పుడు చెమట, శ్వాస ద్వారా..


మనం ఒత్తిడిలో ఉన్నామన్న సంగతి మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. కానీ, కుక్కలు మన చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కుక్కలు అత్యంత సున్నితమైన, సహజ జ్ఞానం కలిగిన జంతువులని మరోసారి నిరూపితమైంది. యూకేలోని బెలఫాస్ట్‌ నగరం నుంచి నాలుగు కుక్కలు, 36 మంది మనుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ‘మానవులు ఒత్తిడికి లోనైనప్పుడు చెమట, శ్వాస ద్వారా భిన్నమైన వాసనలు వస్తాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. రిలాక్స్‌గా ఉన్నప్పుడు మన వాసన వేరుగా ఉంటుంది, ఆ తేడాను కుక్కలు పసిగడతాయి. కానీ, కొన్నిసార్లు మనకు కూడా తెలియదు’ అని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి క్లారా విల్సన్‌ తెలిపారు. ఈ రకమైన అధ్యయనం ఇదే తొలిసారని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 07, 2022 10:00 AM