అప్పుడు పులికి, ఇప్పుడు కుక్కకి.. చుక్కలు చూపించిన బాతు
ఆ మధ్య ఓ బాతు ఏకంగా పెద్ద పులినే ఓ ఆటాడుకున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పడు మరో బాతు తనను పట్టుకోబోయిన శునకానికి చుక్కలు చూపించింది.
ఆ మధ్య ఓ బాతు ఏకంగా పెద్ద పులినే ఓ ఆటాడుకున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పడు మరో బాతు తనను పట్టుకోబోయిన శునకానికి చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఓ శునకం తన యజమానితో కలిసి షికారుకి వచ్చింది. వెళ్లే దారిలో వారికి ఓ కాలువ కనిపించింది. అందులో ఓ బాతు హాయిగా ఈత కొడుతూ విహిరిస్తోంది. ఆ బాతును చూసిన ఈ కుక్క దాన్ని పట్టుకోవాలనుకుంది. పరుగెత్తుకెళ్లింది. బాతును పట్టుకోబోయింది. ఈ శునకాన్ని ముందే గమనించిన బాతు… దానికి దొరక్కుండా నీటిలో మునిగిపోయింది. మరోచోట తేలింది. కుక్క మళ్లీ అక్కడికి పరుగెత్తింది.. అది చూసి బాతు… ఈ ఆటేదో బావుందే.. అనుకున్నట్టుంది.. కాసేపు ఆ శునకాన్ని ఓ ఆటాడుకుంది. దొరికి నట్టే దొరికి నీటిలో మునుగుతూ కుక్కును ముప్పుతిప్పలు పెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం సరదా.. పెళ్లికూతురినే ఈడ్చుకెళ్లిపోయారుగా !!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
