Dog-hen-Funny: మనుషులను మించిన గజదొంగలు.. కుమ్మక్కై దోచేస్తున్న కుక్క, కోడి..

Dog-hen-Funny: మనుషులను మించిన గజదొంగలు.. కుమ్మక్కై దోచేస్తున్న కుక్క, కోడి..

Anil kumar poka

|

Updated on: Jul 31, 2022 | 6:15 PM

ఇటీవల ఇంటర్నెట్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అవి చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.


ఇటీవల ఇంటర్నెట్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అవి చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసి తెగ నవ్వేసుకుంటున్నారు జనాలు. మనుషులను మించిన గజదొంగలు అంటున్నారు.ఎలా కలిశాయో గానీ.. కుక్క, కోడి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. ఆ స్నేహం ఎంతలా అంటే.. ఏపని చేసినా రెండూ కలిసే చేస్తున్నాయి. ఒకదాన్ని విడిచి మరొకటి అస్సలు ఉండటం లేదు. అయితే, వీటికి బాగా ఆకలేసిందో ఏమో గానీ.. రెండూ కలిసి ఓ భారీ చోరీ చేశాయి. చాలా తెలివిగా దొంగిలించాయి. ఇంట్లో సెల్ఫ్‌పై ఆహార పదార్థాలు పెట్టగా.. కుక్క, కోడి రెండూ కలిసి వచ్చాయి. కోడికి ఆ ఆహారం అందకపోవడంతో.. కుక్క వీపు పైకి ఎక్కి నోటికి అందినకాడికి కుమ్మేసింది. అయితే, ఈ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ రెండూ కలిసి చేసిన పనికి అందరూ నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Jul 31, 2022 06:15 PM