డాడీ వచ్చేస్తున్నారు.. టీవీ ఆఫ్‌చేయ్‌.. అలర్ట్ చేసిన కుక్క

డాడీ వచ్చేస్తున్నారు.. టీవీ ఆఫ్‌చేయ్‌.. అలర్ట్ చేసిన కుక్క

Phani CH

|

Updated on: Dec 29, 2022 | 9:25 AM

కుక్కలు చాలా తెలివైనవి, విశ్వాసం కలిగిన జీవి. అందుకే చాలామంది ఇంట్లో కుక్కలను పెంచుకోడానికి ఆసక్తి చూపుతారు. అవి తమ యజమాని పట్ల, అతని కుటుంబంపట్ల ఎంతో ప్రేమ, అభిమానం కలిగి ఉంటాయి.

కుక్కలు చాలా తెలివైనవి, విశ్వాసం కలిగిన జీవి. అందుకే చాలామంది ఇంట్లో కుక్కలను పెంచుకోడానికి ఆసక్తి చూపుతారు. అవి తమ యజమాని పట్ల, అతని కుటుంబంపట్ల ఎంతో ప్రేమ, అభిమానం కలిగి ఉంటాయి. వారి సంరక్షణకోసం ప్రాణాలనుసైతం పణంగా పెడతాయి. తాజాగా ఓ పెట్‌ డాగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఓ చిన్నారి స్కూలునుంచి వచ్చి హోం వర్క్‌ పక్కన పెట్టేసి టీవీ చూస్తూ ఉంది. అక్కడే వాళ్ల పెంపుడు కుక్క పడుకొని ఉంది. ఇంతలో బయట ఆ చిన్నారి తండ్రి ఆఫీసునుంచి వచ్చినట్లు ఈ కుక్క గ్రహించింది. వెంటనే లేచి, చిన్నారిని అలర్ట్‌ చేసింది. భౌభౌ మని అరుస్తూ ‘డాడీ వచ్చేశారు.. టీవీ చూస్తే కోప్పడతారు, వెంటనే టీవీ కట్టేసి బుక్‌ తీసి చదువుకో’ అన్నట్టుగా ఆ చిన్నారికి సైగ చేసింది. అలర్టయిన ఆ బాలిక వెంటనే టీవీ కట్టేసి హోంవర్క్‌ రాస్తుంది. ఇంతలో ఆ బాలిక తండ్రి ఇంట్లోకి వస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మామా.. నీ బిడ్డనివ్వకపోతే నే సచ్చిపోతా.. చివరికి ఏమైందంటే ??

‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటే.. ఎగ్జామ్‌లో పాస్‌ చేస్తా’

Waltair Veerayya: రవితేజ పాత్రను పొరపాటున లీక్ చేసిన చిరు..

Director Shankar: చరణ్‌ ఫ్యాన్స్‌ కోసం… శంకర్ భారీ సర్‌ప్రైజ్‌..

మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్

 

Published on: Dec 29, 2022 09:25 AM