Harsh Goenka: 90 ఏళ్ల వృద్ధులు ఆరోగ్యంగా ఎలా జీవిస్తున్నారో తెలుసా.?: హర్ష గోయెంకా.

|

Mar 30, 2024 | 4:11 PM

మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనిషి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. పాత తరం వాళ్లు 90 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా జీవిస్తుంటే.. నేటి తరం మాత్రం 30 ఏళ్లకే వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఏం చేయాలో ఓ డాక్టర్‌ చెబుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్‌ ఫార్ములాతో ఏకీభవిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనిషి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. పాత తరం వాళ్లు 90 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా జీవిస్తుంటే.. నేటి తరం మాత్రం 30 ఏళ్లకే వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఏం చేయాలో ఓ డాక్టర్‌ చెబుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్‌ ఫార్ములాతో ఏకీభవిస్తూ కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో డాక్టర్‌ నిషిత్‌ చోక్సీ మాట్లాడుతూ.. తన దగ్గరకు వచ్చే చాలా మంది రోగుల్లో 90 నుంచి 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారనీ తనను కలవడానికి వచ్చిన ప్రతిసారీ తమ మధ్య మందుల గురించి చర్చ రాదనీ అన్నారు. వాళ్లను తాను రక్తపోటు ఎలా ఉంది? అని అడిగితే దానికి వాళ్లు బాగానే ఉందని సమాధానమిస్తారట, ఛాతీలో ఏమైనా నొప్పి ఉందా? అని అడిగితే.. ఏం లేదు, అంతా బాగానే ఉందంటారనీ డాక్టర్ తెలిపారు. తర్వాత వాళ్ల మనవళ్లు, మనవరాళ్ల గురించి కాసేపు ముచ్చటిస్తారట. 90 ఏళ్ల వయసులో కూడా చురుగ్గా ఉంటూ.. పనులు స్వయంగా చేసుకోవడం వెనుక రహస్యం ఏంటి? అని డాక్టర్‌ వారిని అడిగితే.. దానికి వాళ్లు చెప్పే సమాధానం.. సంతోషంగా ఉండటం, ఉన్న దాంతో సంతృప్తి చెందడం, వ్యాయామం చేయడం.

ఈ మూడు విషయాలే తమ ఆరోగ్యకర జీవన రహస్యం అంటారట. తను మాట్లాడే వాళ్లలో ఒకరితో ఒకరికి పరిచయం లేదు కానీ, వాళ్లంతా చెప్పే సమాధానం ఒక్కటే అనీ వాళ్లల్లో 90 ఏళ్ల మహిళ ఉన్నారనీ ఆమె రోజూ జిమ్‌కు వెళ్తారనీ డాక్టర్‌ చెప్పారు. చేతికర్ర సాయం లేకుండా నడుస్తారనీ ఆమె మెదడు ఎంతో చురుగ్గా ఉంటుందనీ వంట తనే చేసుకుంటారనీ ఆత్మవిశ్వాసం ఎక్కువే అని డాక్టర్ తెలిపారు. కొన్నిసార్లు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. కావాల్సింది దొరకలేదని ఆందోళన చెందుతాం. ఇవి శరీరంపై ఒత్తిడిని పెంచి రక్తపోటు వంటి వాటికి కారణమవుతాయి. జరిగేది ఎలాగూ జరగక మానదు. సంతోషం, సంతృప్తి, వ్యాయామం ఈ మూడు జీవితంలో ఎంతో ముఖ్యమైనవి అని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on