జాంబియాలో పెళ్లి నిశ్చితార్థం ఎలా చేస్తారో తెలుసా ??

|

May 11, 2024 | 1:10 PM

భారత దేశంలో పెళ్లి అయినా, నిశ్చితార్థం అయినా ఓ రేంజ్‌లో నిర్వహిస్తారు. వరుడి తరపు వారు నిశ్చితార్థానికి అవసరమైన అన్ని వస్తువులు, రకరకాల కానుకలతో అమ్మాయి ఇంటికి బంధుమిత్ర సమేతంగా వచ్చి అమ్మాయిని తమ ఇంటికి కోడలిగా ఆహ్వానిస్తూ వేదమంత్రాల సాక్షిగా నిశ్చితార్థం చేసుకుంటారు. అనంతరం ఇరు కుటుంబాలవారు ఆనందగా కలిసి భోజనాలు చేస్తారు. అలా సబంధాన్ని కలుపుకుంటారు. ఇక ఈ విందులో రకరకాల వంటకాలతో అదరగొట్టేస్తారు.

భారత దేశంలో పెళ్లి అయినా, నిశ్చితార్థం అయినా ఓ రేంజ్‌లో నిర్వహిస్తారు. వరుడి తరపు వారు నిశ్చితార్థానికి అవసరమైన అన్ని వస్తువులు, రకరకాల కానుకలతో అమ్మాయి ఇంటికి బంధుమిత్ర సమేతంగా వచ్చి అమ్మాయిని తమ ఇంటికి కోడలిగా ఆహ్వానిస్తూ వేదమంత్రాల సాక్షిగా నిశ్చితార్థం చేసుకుంటారు. అనంతరం ఇరు కుటుంబాలవారు ఆనందగా కలిసి భోజనాలు చేస్తారు. అలా సబంధాన్ని కలుపుకుంటారు. ఇక ఈ విందులో రకరకాల వంటకాలతో అదరగొట్టేస్తారు. ఇది మన భారతదేశ సంప్రదాయం. అయితే పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం సంప్రదాయం పాటిస్తారు. కొన్ని దేశాల సంప్రదాయాలు మన దేశ సంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వాటిలో జాంబియా దేశం ఒకటి. అయితే మన సంప్రదాయానికి..జాంబియా దేశస్తుల సంప్రదాయానికీ చిన్న తేడా ఏంటంటే.. ఇక్కడ వధువే వరుడి కుటుంబ సభ్యులందరికీ నిశ్చితార్థం రోజు వంట చేసి పెట్టాలి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు తన వంటలతో అత్తింటి వారిని మెప్పించాలి. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్‌ వేడుకలో భాగంగా వధువు, ఆమె కుటుంబ సభ్యులు అంతా కలిసి వరుడి కుటుంబ కోసం రకరకాల వంటలను తయారు చేస్తారు. దీన్నే ఇచిలంగా ములి అంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిజీగా ఉన్నామన్న ఆలోచనే బ్రెయిన్‌కు డేంజరా

Japan: జపాన్‌లో లక్షల్లో ఇళ్లు ఖాళీ.. ఎందుకంటే ??

వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. 50 లక్షల పరిహారానికి డిమాండ్

కార్లలో క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్యయనంలో వెల్లడి

విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

Follow us on