ఒంటికాలుపై బ్రతుకు పోరాటం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆత్మవిశ్వాసం, ధైర్యం తోడుగా ఉంటే ఎలాంటి అడ్డంకులైనా సులభంగా అధిగమించవచ్చు. ఈ ప్రపంచం ముందు మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

Phani CH

|

Aug 10, 2022 | 9:55 AM

ఆత్మవిశ్వాసం, ధైర్యం తోడుగా ఉంటే ఎలాంటి అడ్డంకులైనా సులభంగా అధిగమించవచ్చు. ఈ ప్రపంచం ముందు మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇటీవల వీల్‌చైర్లో కూర్చొని ఫుడ్‌ డెలివరీ విధులు నిర్వర్తిస్తున్న డెలివరీ బాయ్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఎమోషనల్‌ అవుతున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ వ్యక్తికి కాలు లేదు. అయినా చేతి కర్రల సహాయంతో సిమెంట్ బస్తాలు మోస్తుండడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అతను చేస్తున్నది చిన్నపని కావొచ్చు. కానీ ఈ వీడియో చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలు, నిస్సహాయతతో ఆత్మహత్యలు చేసుకునే యువతకు ఈ వ్యక్తి చేసే చర్య స్పూర్తినిస్తోంది. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ‘ధైర్యం ఉన్నవారికి దేవుడు కూడా అండగా నిలుస్తాడు. మన మట్టిలోనే ఏదో గొప్పతనం ఉంది’ అంటూ సిమెంట్ బస్తాలు మోస్తోన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: నల్లపాముతో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి..

ఇతని గట్స్ కు సలాం.. జింకకోసం ప్రాణాలకు తెగించి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఇదేంట్రా నాయనా.. ఈ రేంజ్‌ క్రేజ్‌ ఎక్కడా చూడలేగా !!

జూనియర్ మహరాజ్.. హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు..

Suriya: కన్నీళ్లు పెట్టిస్తున్న హీరో గతం !! 1200 కోసం అప్పుడు ఆ పని చేశారట !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu