Flights: రామ్‌లల్లా భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌నుంచి డైరెక్ట్ ఫ్లైట్.
అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రామజన్మభూమి అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే రైలు సర్వీసులు చాలా అందుబాటులోకి వచ్చాయి.
అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రామజన్మభూమి అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే రైలు సర్వీసులు చాలా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నేరుగా ఫ్లైట్‌లో వెళ్లే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రెండు గంటల్లోనే చేరుకుంటారు. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అవే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.