సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!

సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!

Phani CH

|

Updated on: Aug 24, 2022 | 9:41 AM

తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె. అగరం గ్రామంలో అయ్యారమ్మన్‌ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ.

తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె. అగరం గ్రామంలో అయ్యారమ్మన్‌ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఆగస్ట్ 14న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. అయ్యారమ్మన్‌కు పాపంపట్టి గ్రామానికి చెందిన శాంతి అమ్మాల్‌ అనే భక్తురాలు కాలే నూనెలో వడలను చేతితో తీసి భక్తులకు చూపించి వాటితో అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకోసం 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు భక్తురాలు తెలిపింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్

బెంగుళూరులో VDకి తిమ్మని అనుభవం.. ఇక అంతే !! ఎమోషనల్ అయిన హీరో

Lingusamy: రామ్‌ ‘ది వారియర్’ డైరెక్టర్‌కు 6 నెలలు జైలు శిక్ష

ఇదెక్కడి రోగం రా అయ్యా.. పిలిచి అవార్డ్ ఇస్తే.. వద్దని కేసు పెట్టింది

మైకు దొరికింది కదాని మాట్లాడింది !! నెటిజన్లు ఇచ్చిన షాక్‌కు బలైంది

Published on: Aug 24, 2022 09:41 AM