జొమాటో బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతిచ్చి స్వాగతం..
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కస్టమర్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. కాగా, ఆ కస్టమర్ ఆర్డర్ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్..
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కస్టమర్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. కాగా, ఆ కస్టమర్ ఆర్డర్ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్.. ఓ గంట ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. అటు వర్షం.. ఇటు పండుగ కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ జొమాటో డెలివరీ బాయ్ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ అందించాడు. అయితే, ఫుడ్‌ను డెలివరీ ఇస్తున్న సమయంలో సదరు కస్టమర్.. వినూత్నంగా స్వాగతం పలికాడు. ఫుడ్ డెలివరీ బాయ్ కుమార్.. గుమ్మం ముందుకు వచ్చిన వెంటనే కస్టమర్.. డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి స్వాగతం పలికాడు. దీంతో, సదరు డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నవ్వుతూ అలాగే నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకునే వాళ్లు ఇలాగే స్పందిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్ దిగ్గజం బంపరాఫర్
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!
181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

