కస్టమర్‌కు 'ఉబర్‌' షాక్‌.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!

కస్టమర్‌కు ‘ఉబర్‌’ షాక్‌.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!

Phani CH

|

Updated on: Oct 13, 2022 | 9:12 AM

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని క్యాబ్ సేవలు పెరిగిపోయాయి. కారు లేకున్నా ఎంచక్కా ప్రయాణం చేయగలుగుతున్నాం. ఈ క్రమంలోనే యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలను అందిస్తున్న ఉబర్‌..

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని క్యాబ్ సేవలు పెరిగిపోయాయి. కారు లేకున్నా ఎంచక్కా ప్రయాణం చేయగలుగుతున్నాం. ఈ క్రమంలోనే యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలను అందిస్తున్న ఉబర్‌.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్‌ బుక్‌ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా 32 లక్షల రూపాయల ఛార్జ్‌ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్‌. క్యాబ్‌ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్‌ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం కంగుతిన్నాడు. ఇంగ్లాండ్‌, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్‌ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్‌ షేర్‌ యాప్‌ ద్వారా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??

Published on: Oct 13, 2022 09:12 AM