చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??
కన్నకొడుకు మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీట మునిగి మరణించిన తనయుడిని ఉప్పు పాతర వేస్తే తిరిగి బతికొస్తాడని నమ్ముతూ ఎదురు చూస్తున్నారు.
కన్నకొడుకు మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీట మునిగి మరణించిన తనయుడిని ఉప్పు పాతర వేస్తే తిరిగి బతికొస్తాడని నమ్ముతూ ఎదురు చూస్తున్నారు. నీట మునిగి మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు పదేళ్ల భాస్కర్ ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 4–5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలుడు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. చివరికి గ్రామపెద్దలు తల్లిదండ్రులను ఒప్పించి బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: తీన్మార్ డాన్స్ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!
Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!
పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్ కారులో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో
Ganesh Nimajjanam 2022: మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనం.. లైవ్ వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

