పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్ కారులో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో
నిరుపేదలకు ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం అందిస్తోంది ప్రభుత్వం. కానీ ఇక్కడ బెంజ్ కారులో రేషన్ సరుకులను తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
నిరుపేదలకు ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం అందిస్తోంది ప్రభుత్వం. కానీ ఇక్కడ బెంజ్ కారులో రేషన్ సరుకులను తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని హోషియార్‌పూర్‌లో ఓ వ్యక్తి ఉచిత రేషన్‌ను తీసుకోవడానికి బెంజ్ కారులో వచ్చాడు. పంజాబ్ ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్‌ను కారులో తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత రేషన్ పథకం దుర్వినియోగం అవుతోందని దేశమంతటా విమర్శలు వస్తున్నాయి. అయితే బెంజ్ కారులో రేషన్‌షాప్‌కు వచ్చిన వ్యక్తి తరువాత వివరణ ఇచ్చుకున్నాడు. ఆ వ్యక్తి పేరు సుమిత్ షైనీ. ఆ కారు తనది కాదని , విదేశాల్లో ఉన్న బంధువులదని చెప్పుకొచ్చాడు. రేషన్ దుకాణంలో క్యూలైన్‌లో ఉన్న తన పిల్లలు రేషన్‌ను తీసుకెళ్లడానికి రావాలని కోరడంతో ఆ కారును తీసుకొచ్చినట్టు తెలిపారు. డీజిల్ కారు కావడంతో అప్పుడప్పుడు స్టార్ట్ చేయాలని, అందుకే రేషన్ షాప్‌కు కారును తీసుకొచ్చినట్టు తెలిపాడు. తను మాత్రం పేదవాడినేనని, తన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారని, కావాలంటనే దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ganesh Nimajjanam 2022: మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనం.. లైవ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

