Viral: తీన్మార్ డాన్స్ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!
మనుషుల్లో శాడిజం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మరి జంతువులు, పక్షుల్లో శాడిజాన్ని ఎప్పుడైనా చూశారా? అవును, మనుషులు మాదిరిగానే వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి.
మనుషుల్లో శాడిజం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మరి జంతువులు, పక్షుల్లో శాడిజాన్ని ఎప్పుడైనా చూశారా? అవును, మనుషులు మాదిరిగానే వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్కోసారి అవికూడా తమ శాడిజాన్ని ప్రదర్శిస్తాయి. ఎంతలా అంటే.. తమలోని పైత్యాన్నంతా బయటపెట్టి.. చిందేస్తాయి. తాజాగా ఓ రామ చిలుక.. తన శాడిజం మొత్తాన్ని ప్రదర్శించింది. ఒక్కో వస్తువులు ధ్వంసం చేస్తూ రాక్షసానందంతో మాస్ డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ రామ చిలుక టేబుల్‌పైన ఉంది. దానికి తన యజమానిపై ఎందుకో కోపం వచ్చినట్టుంది. కనిపించిన వస్తువులన్నీ కింద పడేసి చిందరవందర చేసేసింది. దాని యజమాని ఆ టేబుల్‌పైన ఓ బాటిల్ పెట్టారు. పక్కనే ఉన్న రామ చిలుక.. ఆ బాటిల్‌ను కిందకు తోసేసింది. ఆ తరువాత మరో బాక్స్ పెడితే.. దాన్ని కూడా పడేసింది. ఈసారి గాజు కప్పు పెట్టారు.. దానినీ పడేసింది. ఇలా ఆ టేబుల్ పై ఏది పెడితే అది కిందపడేస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. పైగా అది పడిందా లేదా అని చెక్ చేసి, అవి కింద పడిపోవడంతో ఆనందంతో తీన్మార్ స్టెప్పులేసింది. ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా.. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు.. కంత్రీ ప్యారట్.. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!
పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్ కారులో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో
Ganesh Nimajjanam 2022: మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనం.. లైవ్ వీడియో
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

