Viral Video: అయ్యో.. ఏదో చేయబోతే.. ఇంకేదో అయ్యిందే..! డాన్స్ వీడియో చూసి షాకవుతోన్న నెటిజన్లు..
ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హాగ్ పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 98 వేలకు పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.
వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీ(Funny)గా ఉంటాయి. నెట్టింట్లో ఎన్నో డ్యాన్స్ వీడియో(Dance Video)లు చూసి ఉంటారు. ఒక్కోసారి అద్భుతంగా డాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి డాన్స్‌ల్లో జరిగే చిన్న చిన్న తప్పులే తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది(Viral). మనోడి డాన్స్‌తో ఏకంగా ఫ్లోర్‌నే బద్దలు కొట్టడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎలా డాన్స్ చేస్తున్నారో వీడియోలో చూడవచ్చు. వీరి డ్యాన్స్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఒక వ్యక్తి తన కాళ్ళు, చేతులు పైకెత్తి వింతగా డ్యాన్స్ చేస్తుంటే, మరొక వ్యక్తి తన ఒక కాలును తన చేతితో పట్టుకుని, ఒక కాలుతో జంపర్ డాన్స్ చేస్తున్నాడు. ఈ సమయంలో అతను ఒక్కసారిగా పైకి లేచి కిందకి దూకగానే.. పక్కనున్న వారు కూడా షాకయ్యారు. అలా ఒక్కసారిగా అకస్మాత్తుగా పడిపోవడంతో అతని శరీరం సగానికి పైగా ఫ్లోర్‌లోకి దూరిపోతుంది. నేలను పగలగొట్టే ఈయన డ్యాన్స్‌ను మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. ఈ వీడియో మాత్రం నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
Also Read: Watch Video: ఇదెక్కడి మాస్ బౌలింగ్‌రా మావా.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో
ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హాగ్ పేరుతో అప్‌లోడ్ చేశారు. ‘ఈ వ్యక్తి నిజంగా డాన్స్ ఫ్లోర్‌ను బద్దలు కొట్టేశాడు’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 98 వేలకు పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రియాక్షన్స్ ఇచ్చారు. కనీసం డాన్స్ ఫ్లోర్‌ను బద్దలు కొట్టే ఫీట్ చేశాడని ఓ యూజర్ కామెంట్ చేస్తే, ఇది ‘బ్రేక్’ డ్యాన్స్ అని మరో యూజర్ రాసుకొచ్చాడు. మీరూ ఈ వీడియోను చూడండి..
View this post on Instagram