Power bill: కరెంటు బిల్లు చూసి మైండ్ బ్లాంక్.. మూడు గదుల రేకుల ఇంటికి రూ.7లక్షల బిల్లు.!
కరెంటు తీగను పట్టుకుంటేనే కాదు. అప్పడప్పుడు కరెంట్ బిల్లు స్లిప్ చూసినా షాక్కొడుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల వల్ల పూరి గుడిసెలు, రేకుల ఇళ్లల్లో నివాసముండే వ్యక్తులకూ..
కరెంటు తీగను పట్టుకుంటేనే కాదు. అప్పడప్పుడు కరెంట్ బిల్లు స్లిప్ చూసినా షాక్కొడుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల వల్ల పూరి గుడిసెలు, రేకుల ఇళ్లల్లో నివాసముండే వ్యక్తులకూ రూ.లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. ఆ బిల్లులు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలి కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ ఫ్యాన్, టీవీ, రెండు బల్బులు ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ 7.2 లక్షల విద్యుత్ బిల్లు రావడం చూసి వారు అవాక్కయ్యారు. గత నెలలో వారు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఇందుకు గాను రూ.7,02,825 బిల్లు వచ్చింది. రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల బిల్లు రావడం చూసి వారు అవాక్కయ్యారు.ఏప్రిల్ వరకు నెలకు సగటున రూ.400 వరకు బిల్లు వచ్చేది. ఇదేంది సారూ.. ఎలా సరిదిద్దుతారు? అని అడిగేందుకు స్థానిక బిల్లు కలెక్టర్‌ను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారని సంపత్ వాపోయారు. తప్పుల తడక బిల్లులతో హైరానా పెట్టడం సరికాదని అధికారులు బిల్లు సరిచేయాలని బాధితుడు కోరుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

