Miss World-2024: ముంబై వేదికగా మిస్ వరల్డ్-2024 పోటీలు.! కిరీటం అందుకున్న క్రిస్టీనా పిస్కోవా.

Miss World-2024: ముంబై వేదికగా మిస్ వరల్డ్-2024 పోటీలు.! కిరీటం అందుకున్న క్రిస్టీనా పిస్కోవా.

Anil kumar poka

|

Updated on: Mar 13, 2024 | 2:36 PM

ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 112 దేశాల సుందరీమణుల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. క్రిస్టీనా తరువాత తొలి మూడు స్థానాల్లో లెబనాన్‌కి చెందిన యాస్మిన్ అజైటౌన్ , ట్రినిడాడ్‌ అండ్‌ టుబాకోకు చెందిన ఆచే అబ్రహాంస్ , బొత్స్వానాకు చెందిన లీసాగో చోంబో నిలిచారు.

ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 112 దేశాల సుందరీమణుల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. క్రిస్టీనా తరువాత తొలి మూడు స్థానాల్లో లెబనాన్‌కి చెందిన యాస్మిన్ అజైటౌన్ , ట్రినిడాడ్‌ అండ్‌ టుబాకోకు చెందిన ఆచే అబ్రహాంస్ , బొత్స్వానాకు చెందిన లీసాగో చోంబో నిలిచారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో రన్నరప్‌గా లెబనాన్ భామ అజైటౌన్ నిలిచింది. భారత్‌కు ఈ పోటీల్లో నిరాశే మిగిలింది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్-8 వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకూ ఆమె గట్టిపోటీనే ఇచ్చినా అజైటౌన్ కు టాప్-4లో చోటుదక్కడంతో సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌వుమన్ జూలియా మోర్లీ.. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..