బిచ్చగాడి సంపాదన నెలకు రూ. 8 లక్షలు
ఓ చైనా నటుడు యాచిస్తూ నెలకు 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇలా ఏడాదికి దాదాపు రూ. కోటి ఆర్జిస్తున్నాడు. అతని పేరు లూ జింగాంగ్. ప్రొఫెషనల్ చైనీస్ నటుడు. అయితే, అతనికి నటన రంగంలో సరైన అవకాశాలు రాలేదు. దాంతో బతుకుదెరువు కోసం తన నటనా నైపుణ్యాలను మరో విధంగా ఉపయోగించాడు. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఉపయోగించి భిక్షాటన చేయడం మొదలెట్టాడు. బాగా జనాదరణ పొందిన, ఎప్పుడూ రద్దీగా ఉండే టూరిస్ట్ స్పాట్‌లో యాచిస్తూ ఇప్పుడు నెలకు రూ.8 లక్షల
ఓ చైనా నటుడు యాచిస్తూ నెలకు 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇలా ఏడాదికి దాదాపు రూ. కోటి ఆర్జిస్తున్నాడు. అతని పేరు లూ జింగాంగ్. ప్రొఫెషనల్ చైనీస్ నటుడు. అయితే, అతనికి నటన రంగంలో సరైన అవకాశాలు రాలేదు. దాంతో బతుకుదెరువు కోసం తన నటనా నైపుణ్యాలను మరో విధంగా ఉపయోగించాడు. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఉపయోగించి భిక్షాటన చేయడం మొదలెట్టాడు. బాగా జనాదరణ పొందిన, ఎప్పుడూ రద్దీగా ఉండే టూరిస్ట్ స్పాట్‌లో యాచిస్తూ ఇప్పుడు నెలకు రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఒక ప్రొఫెషనల్ నటుడయిన లూ గత 12 ఏళ్లుగా చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని క్వింగ్మింగ్ షాంగే గార్డెన్ అనే టూరిస్ట్ ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు మంచి బట్టల్లోనే అక్కడికి వస్తాడట. అక్కడికి వచ్చిన తర్వాత చిరిగిపోయిన దుస్తులు వేసుకుని, ముఖానికి నల్లటి మసిని రాసుకుంటాడు. అనంతరం తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తాడు. ముఖాన్ని ఎప్పుడూ విచారంగా ఉంచడంతో పాటు అప్పడప్పుడు ఏడుపును కూడా నటిస్తాడట. అంతే.. పర్యాటకులు లూ ని ఆ పరిస్థితిలో చూసి జాలిపడి తమ జేబుల్లోంచి చిల్లర తీసి వేస్తుంటారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంకు ఉద్యోగుల జీతాలు 17% పెంపు
మహేష్ సాంగ్‌కు.. దిమ్మతిరిగేలా డ్యాన్స్ చేసిన సిమ్రన్
Hanuman: ఎట్టకేలకు హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..
Sekhar Kammula: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం
Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!