టర్నింగ్‌లో ఓవర్‌ యాక్షన్‌ చేస్తే ఇలాగే ఉంటుంది

Updated on: Oct 11, 2023 | 9:16 AM

కుర్రకారు బైక్‌ ఎక్కారంటే వారిని ఆపడం ఎవరి తరం కాదు. రైయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లిపోతారు. రోడ్డు ఏదైనా వేగంలో తగ్గేదే లేదంటూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలు, పోలీసులు, చాలాన్లు ఏవీ వాళ్లను ఆపలేవు. అలా వేగంగా దూసుకెళ్తూ ఒక్కోసారి తమతోపాటు ఇతరులను కూడా ప్రమాదాల్లో పడేస్తుటారు. పోలీసులు ఎంత మొత్తుకున్నా వారి సూచనలు పట్టించుకోరు. ముఖ్యంగా మలుపుల్లో పరిమితికి మించి వేగంగా వెళ్లడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయన్న..

కుర్రకారు బైక్‌ ఎక్కారంటే వారిని ఆపడం ఎవరి తరం కాదు. రైయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లిపోతారు. రోడ్డు ఏదైనా వేగంలో తగ్గేదే లేదంటూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలు, పోలీసులు, చాలాన్లు ఏవీ వాళ్లను ఆపలేవు. అలా వేగంగా దూసుకెళ్తూ ఒక్కోసారి తమతోపాటు ఇతరులను కూడా ప్రమాదాల్లో పడేస్తుటారు. పోలీసులు ఎంత మొత్తుకున్నా వారి సూచనలు పట్టించుకోరు. ముఖ్యంగా మలుపుల్లో పరిమితికి మించి వేగంగా వెళ్లడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయన్న దానిపై సైబరాబాద్‌ పోలీసులు ఓ వీడియోను ట్విట్టర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సూరత్ పట్టణంలో ఫ్లై ఓవర్ పై ఓ బైక్ రేసర్.. మలుపులో వేగం తగ్గించకుండా కారును ఓవర్ టేక్ చేసి ముందుకు పోవడంతో అది కాస్తా అదుపుతప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. పిట్ట గోడపై వాహనదారుడు పడిపోయాడు. ఇంకొంచెం బ్యాలన్స్ తప్పితే వంతెన మీద నుంచి కింద పడి మరణించే వాడే. కానీ, అదృష్టవశాత్తూ క్షేమంగా బయటబడ్డాడు. బైక్‌ వెనుక వస్తున్న కారుకి ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆమ్లెట్‌ తినండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి..

తక్కువ ధరకే బంగారు నాణేలు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

స్కూటీపై నుంచి కిందపడ్డ యువతులు.. సాయం చేయడానికి వెళ్లి.. ఏం చేసాడో చూస్తే

వయసు 56 ఏళ్లు … కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..

మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేసిన యువకుడు