వయసు 56 ఏళ్లు ... కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..

వయసు 56 ఏళ్లు … కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..

Phani CH

|

Updated on: Oct 11, 2023 | 9:12 AM

తిరుమల శ్రీనివాసులో లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. వీరిలో చాలామంది కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు. కొందరు తిరుమల వెళ్లిన ప్రతిసారీ కాలినడకన స్వామి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 56 ఏళ్ల మహంతి శ్రీనివాసరావు అనే భక్తుడు ఏకంగా 400 సార్లు కాలినడకతో తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడు. 1996 లో తొలిసారి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన శ్రీనివాసరావు అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీనివాసులో లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. వీరిలో చాలామంది కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు. కొందరు తిరుమల వెళ్లిన ప్రతిసారీ కాలినడకన స్వామి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 56 ఏళ్ల మహంతి శ్రీనివాసరావు అనే భక్తుడు ఏకంగా 400 సార్లు కాలినడకతో తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడు. 1996 లో తొలిసారి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన శ్రీనివాసరావు అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత 2016 వరకు 85 సార్లు కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. 2017 లో అప్పటికి 50 ఏళ్ల వయస్సు ఉన్న శ్రీనివాసరావు ఆ ఒక్క ఏడాదే 50 సార్లు నడకమార్గం లో కొండ ఎక్కారు. 52 వ ఏట 72 సార్లు నడకమార్గం ద్వారా కొండ ఎక్కిన శ్రీనివాసరావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన శ్రీవారి భక్తులను తిరుమల కొండకు తీసుకొస్తూ శ్రీవారి వైభవాన్ని చాటుతూ వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 6న సౌత్ ఇండియా గోవిందా వాట్స్అప్ గ్రూప్ ద్వారా 700 మంది శ్రీవారి భక్తులను తీసుకొని పాదయాత్ర నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30 న 1008 మంది శ్రీవారి భక్తులతో తిరుమల పాదయాత్ర నిర్వహించారు శ్రీనివాసరావు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేసిన యువకుడు

కారు బీభత్సం.. ఓ మహిళను, మరో బైక్‌ను ఢీకొట్టి..

రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్..

ఆకాశం ఎలా కనిపిస్తుందనే వీడియోను పోస్ట్‌ చేసిన చంద్ర అబ్జర్వేటరీ