మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేసిన యువకుడు

మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేసిన యువకుడు

Phani CH

|

Updated on: Oct 11, 2023 | 9:12 AM

బెంగళూరుకు చెందిన ప్రజ్వల్‌ అనే యువకుడికి ప్రాంక్ వీడియోలు చేయడం అలవాటు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చాలా ప్రాంక్ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో గత జులైనెలలో అతడు మెట్రో స్టేషన్‌లో ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అందులో అకస్మాత్తుగా ఏదో అనారోగ్యం వచ్చినట్టు మహిళ ప్రయాణికుల ముందు కూలబడిపోయి నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

బెంగళూరుకు చెందిన ప్రజ్వల్‌ అనే యువకుడికి ప్రాంక్ వీడియోలు చేయడం అలవాటు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చాలా ప్రాంక్ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో గత జులైనెలలో అతడు మెట్రో స్టేషన్‌లో ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అందులో అకస్మాత్తుగా ఏదో అనారోగ్యం వచ్చినట్టు మహిళ ప్రయాణికుల ముందు కూలబడిపోయి నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదంతా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. కానీ నెటిజన్లు మాత్రం ఆ యువకుడు చేసిన పని సరైంది కాదని విమర్శలు గుప్పించారు. ఇది పద్ధతి కాదంటూ మండిపడ్డారు. ఈ ఘటన మెట్రో అధికారుల దృష్టికి వెళ్లింది. అంతే, మెట్రో అధికారులు అతడి ప్రాంక్ వీడియో ఘటనకు సంబంధించి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు నిందితుడిని పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించినందుకు అరెస్టు చేసి, 500 రూపాయలు జరిమానా విధించారు. ప్రాంక్ వీడియోల్లోని అతడి బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు యువకుడి ఆచూకీ పట్టుకున్నారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు బీభత్సం.. ఓ మహిళను, మరో బైక్‌ను ఢీకొట్టి..

రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్..

ఆకాశం ఎలా కనిపిస్తుందనే వీడియోను పోస్ట్‌ చేసిన చంద్ర అబ్జర్వేటరీ