రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్..
గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించు కోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. దీని కోసం తమ ప్రాణాలని కూడా రిస్క్ లో పెడతారు. తాజాగా ఇటలీకి చెందిన స్టంట్ డ్రైవర్ మార్కో డేవిడ్ జియోనీ అనే 43 ఏళ్ల వ్యక్తి రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ బుక్ లో చోటు సాధించాడు. ట్రక్‌ని పూర్తిగా ఎడమ వైపు చక్రాల పై బ్యాలెన్స్ చేస్తూ స్టంట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సైడ్ బారియర్ లను తాకకుండా ఇరుకైన గ్యాప్ లో ట్రక్ ను తీసుకొచ్చాడు.
గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించు కోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. దీని కోసం తమ ప్రాణాలని కూడా రిస్క్ లో పెడతారు. తాజాగా ఇటలీకి చెందిన స్టంట్ డ్రైవర్ మార్కో డేవిడ్ జియోనీ అనే 43 ఏళ్ల వ్యక్తి రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ బుక్ లో చోటు సాధించాడు. ట్రక్‌ని పూర్తిగా ఎడమ వైపు చక్రాల పై బ్యాలెన్స్ చేస్తూ స్టంట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సైడ్ బారియర్ లను తాకకుండా ఇరుకైన గ్యాప్ లో ట్రక్ ను తీసుకొచ్చాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం.. జియోనీ కనీసం 32.8 అడుగులు, వాహనం బోల్తా పడకుండా నడపాలి. జియోని తన మూడో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించాడు. ఈ స్టంట్‌పై మార్కో డేవిడ్ జియోనీ స్పందిస్తూ.. ట్రక్కు క్యాబిన్ చాలా ఎక్కువగా కదులుతుందని, ట్రక్ ని మేనేజ్ చేయడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. అందుకే మరింత ఏకాగ్రత పెట్టి తన మూడో ప్రయత్నంలో విజయం సాధించ గలిగానని చెప్పారు మార్కో డేవిడ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం ఎలా కనిపిస్తుందనే వీడియోను పోస్ట్ చేసిన చంద్ర అబ్జర్వేటరీ