స్కూటీపై నుంచి కిందపడ్డ యువతులు.. సాయం చేయడానికి వెళ్లి.. ఏం చేసాడో చూస్తే

స్కూటీపై నుంచి కిందపడ్డ యువతులు.. సాయం చేయడానికి వెళ్లి.. ఏం చేసాడో చూస్తే

Phani CH

|

Updated on: Oct 11, 2023 | 9:13 AM

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భయానకంగా ఉంటే.. కొన్ని ఫన్నీగా ఉంటూ నెటిజన్లను తెగ నవ్విస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ ఇద్దరు అమ్మాయిలు స్కూటీ వేసుకొని రోడ్డుమీద వెళ్తున్నారు. ఓ చోట కారు ఆగి ఉంది. అక్కడే ఈ అమ్మాయిలు కూడా తమ స్కూటీని ఆపబోయి కింద పడిపోయారు.

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భయానకంగా ఉంటే.. కొన్ని ఫన్నీగా ఉంటూ నెటిజన్లను తెగ నవ్విస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ ఇద్దరు అమ్మాయిలు స్కూటీ వేసుకొని రోడ్డుమీద వెళ్తున్నారు. ఓ చోట కారు ఆగి ఉంది. అక్కడే ఈ అమ్మాయిలు కూడా తమ స్కూటీని ఆపబోయి కింద పడిపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గబగబా వచ్చి వారిని స్కూటీని పైకి లేపాడు. కింద పడ్డ యువతులు ఇద్దరూ పక్కగా లేచి నిలబడ్డారు. సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి స్కూటీని పైకిలేపుతున్నాడు. ఈ క్రమంలో అతను యక్సలేటర్‌మీద చేయి వేయడంతో బైక్‌ వేగంగా దూసుకుపోయింది. స్కూటీతోపాటు ఆ వ్యక్తి కూడా కొలనులో పడిపోయాడు. స్కూటీ రోడ్డుమీదే ఉంటే ఎలాగో లేవదీసుకునేవాళ్లం.. ఇతనొచ్చి మొత్తానికి గంగలో ముంచాడే అంటూ లబోదిబోమంటూ నెత్తిబాదుకున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 9 లక్షలమందికి పైగా వీక్షించారు. లైక్స్‌తో ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వయసు 56 ఏళ్లు … కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..

మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేసిన యువకుడు

కారు బీభత్సం.. ఓ మహిళను, మరో బైక్‌ను ఢీకొట్టి..

రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్..

ఆకాశం ఎలా కనిపిస్తుందనే వీడియోను పోస్ట్‌ చేసిన చంద్ర అబ్జర్వేటరీ