Medaram Jathara: మేడారం జాతరలో వింత సంఘటన.. పెంపుడు కుక్కకు తులాబారం
కోరికలు తీర్చే కొంగుబంగారం సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించడంలో వింతలు - విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. మేడారం జాతరకు ఇంకా సమయం ఉండగానే భక్తులు పెద్ద సంఖ్యలోతరలి వచ్చి మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోరికలు తీరితే మనిషి ఎత్తు బంగారం- అదేనండి..బెల్లం సమర్పిస్తారు.. కానీ కుక్క ఆరోగ్యం బాగుండాలని మొక్కి నిలువెత్తు బంగారం సమర్పించిన కుటుంబాన్ని చూశారా...?
కోరికలు తీర్చే కొంగుబంగారం సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించడంలో వింతలు – విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. మేడారం జాతరకు ఇంకా సమయం ఉండగానే భక్తులు పెద్ద సంఖ్యలోతరలి వచ్చి మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోరికలు తీరితే మనిషి ఎత్తు బంగారం- అదేనండి..బెల్లం సమర్పిస్తారు.. కానీ కుక్క ఆరోగ్యం బాగుండాలని మొక్కి నిలువెత్తు బంగారం సమర్పించిన కుటుంబాన్ని చూశారా…? ఇలాంటి వింత సంఘటన హన్మకొండలో జరిగింది. హనుమకొండకు చెందిన బిక్షపతి – జ్యోతి దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క లియకు గత జాతర సమయంలో సుస్తి చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమీ తినకుండా అస్వస్థతకు గురైంది.. ఆ సమయంలో వారికి ఏమీ తోచక సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నారు.. కుక్క ఆరోగ్యం కుదుటపడితే మళ్ళీ వచ్చే జాతరకు కచ్చితంగా నిలువెత్తు బంగారం సమర్పిస్తామని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నారట. అలా మొక్కిన మూడోరోజులకే లియో ఫుల్ యాక్టీవ్ అయిందట…వాళ్ళ మొక్కు ఫలించింది.. దీంతో సమ్మక్క సారక్క దేవతలకు ఆ కుటుంబం మొక్కు తీర్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై పొలంలోనే బియ్యం తయారు చేసుకునే అవకాశం
40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్‌లో తగ్గేది లేదు రాజా..
సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..