Karnataka: రామాయణ మహాభారతాలు కల్పితాలన్న కాన్వెంట్ స్కూల్ టీచర్‌పై వేటు.
రామాయణ మహాభారతాలు ఊహాజనితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు బోధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కర్ణాటక కాన్వెంట్ స్కూల్ టీచర్‌పై తాజాగా వేటు పడింది. ఆమె తీరుపై మంగళూరులో నిరసనలు వ్యక్తం కావడంతో స్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి డిస్‌మిస్ చేసింది. కర్నాటక మంగళూరులోని సెయింట్ జెరోసా ఇంగ్లిష్ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
రామాయణ మహాభారతాలు ఊహాజనితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు బోధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కర్ణాటక కాన్వెంట్ స్కూల్ టీచర్‌పై తాజాగా వేటు పడింది. ఆమె తీరుపై మంగళూరులో నిరసనలు వ్యక్తం కావడంతో స్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి డిస్‌మిస్ చేసింది. కర్నాటక మంగళూరులోని సెయింట్ జెరోసా ఇంగ్లిష్ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇవే కాకుండా 2002 గుజరాత్ అల్లర్లు, గోద్రా ఘటన, బిల్కిస్ బానోకు సంబంధించి విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా వ్యతిరేకంగా ఆ టీచర్ విద్యార్థులకు బోధిస్తున్నట్లు గుర్తించారు. రాముడు పౌరాణిక వ్యక్తి అని ఉపాధ్యాయుల్లో ఒకరు చెప్పారని.. రామాయణం, మహా భారతం లాంటి పురాణాలు ఒట్టి కల్పితాలు మాత్రమేనని చెప్పడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యం తొలగించింది. మరోవైపు.. ఈ ఘటనపై దృష్టి సారించిన మంగళూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ విచారణ చేపట్టారు. 60 ఏళ్ల స్కూలు చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది. పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు తామందరం కలిసి పనిచేస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..