UPI Services: శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు.! ప్రారంభించిన ప్రధాని మోదీ.

UPI Services: శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు.! ప్రారంభించిన ప్రధాని మోదీ.

Anil kumar poka

|

Updated on: Feb 13, 2024 | 8:11 PM

భారతీయులకు నగదు బదిలీని అత్యంత సులభతరం చేసిన యూపీఐ సేవలు సోమవారం నుంచి శ్రీలంక, మారిషస్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషన్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.యూపీఐ సేవలతో భారతీయులకు శ్రీలంక, మారిషస్‌లో చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది.

భారతీయులకు నగదు బదిలీని అత్యంత సులభతరం చేసిన యూపీఐ సేవలు సోమవారం నుంచి శ్రీలంక, మారిషస్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషన్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ సేవలతో భారతీయులకు శ్రీలంక, మారిషస్‌లో చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లోని శ్రీలంక, మారిషస్ టూరిస్టులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ సేవలతో డిజిటల్ చెల్లింపులు సులభతరం అవుతాయని, ఇరు దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతుందని విదేశాంగ శాఖ పేర్కొంది. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో మారిషస్ బ్యాంకులు రూపే చెల్లింపుల వ్యవస్థ ఆధారిత కార్డులను కూడా జారీ చేసేందుకు వీలు చిక్కింది. వీటి ద్వారా ఇరు దేశాల్లోనూ చెల్లింపులు జరపొచ్చు.
ఇటీవలే ఫ్రాన్స్‌లో కూడా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన NPCI , ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఈకామర్స్, చెల్లింపుల సంస్థ లైరాతో కలిసి అక్కడ యూపీఐ సేవలు ప్రారంభించింది. యూపీఐతో చెల్లింపులు స్వీకరించిన తొలి మర్చెంట్‌గా ఈఫిల్ టవర్ నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..