చైనాలో నిమ్మకాయలను ఎగబడి కొంటున్న జనం.. కారణం ఏంటంటే ??

చైనాలో నిమ్మకాయలను ఎగబడి కొంటున్న జనం.. కారణం ఏంటంటే ??

Phani CH

|

Updated on: Dec 28, 2022 | 9:52 AM

ఈ మాయదారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడు రోజుల్లో ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్‌లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది.

ఈ మాయదారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడు రోజుల్లో ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్‌లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. చైనాలో వేలాది మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటున్నారు. చైనాలో ఎక్కడ చూసినా ఆస్పతి మార్చురీల్లో శవాలు పేరుకుపోతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా చైనాలో నిమ్మకాయలకు అమాంతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. అక్కడ ప్రజలంతా నిమ్మకాయలు కొనేందుకు దుకాణాల వద్దకు ఎగబడటంతో ధరలు సైతం అకాశన్నంటుతున్నట్లు సమాచారం. కరోనా భారి నుంచి బయటపడేందుకు రోగనిరోధక శక్తి కోసం చైనీయులు విటమిన్‌ సీ అధికంగా ఉండే నిమ్మకాలయను కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. దీంతో నిమ్మ రైతుల వ్యాపారాలు అకస్మాత్తుగా పుంజుకున్నాయి. ఈ మేరకు నైరుతీ ప్రావిన్స్‌ కౌంటీ ఎన్యూలో రోజుకు 20 నుంచి 30 టన్నుల నిమ్మకాల విక్రయాలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. గతంలో కేవలం 5 నుంచి 6 టన్నులుగా మాత్రమే ఉండేవంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లిక్కర్‌ లారీ బోల్తా.. మందుబాటిళ్లకోసం ఎగబడిన జనం..

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి బాలుడు.. ఎక్స్‌రే చూసి వైద్యులు షాక్‌ !!

ఇదేం ఉద్యోగం సామీ.. వచ్చిపోయే రైళ్లను లెక్కించాలట

ఏం టాలెంట్ బాస్.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. మగువలు ఫిదా

Jani master: హీరోయిన్‌కు చుక్కలు చూపించిన జానీ మాస్టర్..

 

Published on: Dec 28, 2022 09:52 AM