చేపలకు ఆహారం వేస్తోన్న చింపాంజీ !! నీది ఎంత పెద్ద మనస్సో భయ్యా

చేపలకు ఆహారం వేస్తోన్న చింపాంజీ !! నీది ఎంత పెద్ద మనస్సో భయ్యా

Phani CH

|

Updated on: Jul 26, 2022 | 8:43 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వీటిలో చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో దీన్ని నిరూపితం చేస్తోంది. దీనిలో చింపాంజీ దానకర్ణుడిలా మారింది.. చింపాంజీ చేపలకు ఆహారం వేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దానంలో దీనిని మించింది ఏది లేదంటూ అభినందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో చింపాంజీ ప్రశాంతంగా చెక్క వంతెనపై కూర్చుని ఉంది. ఇది కొలనులోని చేపలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో గిన్నెలోని ఆహారాన్ని తీసి.. చేపలకు వేసింది. అయితే.. చింపాంజీ చేసిన పని.. అచ్చం మనిషి మాదిరిగానే కనిపిస్తుంది. ఆహారం పంచుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుందన్న సందేశం ఈ వీడియోలో దాగి ఉందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనిని 14 లక్షల మందికి పైగా చూశారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాల్‌గాల్స్‌ కావాలా నాయనా !! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెసేజ్‌ !! సీన్ కట్ చేస్తే

ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం !! భయాందోళనలకు గురైన ప్రజలు..

50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుపెట్టిన మొద‌టి వ్యక్తి.. నేటికీ చెర‌గ‌ని పాద‌ముద్రలు

News Watch: KCR ముందస్తుకు వెళ్ళకపోవచ్చట !! ఇష్టాగోష్ఠిలో తమిళి సై ??

Published on: Jul 26, 2022 08:43 AM