ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం !! భయాందోళనలకు గురైన ప్రజలు..
సాయం సంధ్యవేళ అరుణకాంతితో వెలిగిపోవాల్సిన ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం అంతా గులాబీ వర్ణం అలముకుంది.
సాయం సంధ్యవేళ అరుణకాంతితో వెలిగిపోవాల్సిన ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం అంతా గులాబీ వర్ణం అలముకుంది. దీంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందారు. ఏదైనా ఉపద్రవం రాబోతుందేమో అని భయపడ్డారు. ఇంతలోనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఏలియన్స్ భూమిపై దాడి చేయబోతున్నారని కొందరు.. గ్రహాలు ఢీకొట్టి శకలాలు కిందపడబోతున్నాయని ఇంకొందరు.. భూమి ఇక ఎండ్ అయిపోతుందని మరికొందరు.. ఇలా తమకు ఇష్టమొచ్చిన కథలు అల్లేశారు. కానీ అంత సీన్ ఏమీ లేదు. ఆకాశం గులాబీ వర్ణంలోకి మారడానికి కారణం గంజాయి తోట. ఆస్ట్రేలియాలోని నార్తరన్ విక్టోరియాలో మిల్డురా పట్టణంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ప్రభుత్వం వైద్య అవసరాల కోసం రహస్యంగా గంజాయిని పెంచుతోంది. ఇందుకోసం ప్రత్యేక ఏజెన్సీలు పని చేస్తాయి. ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులకు కూడా అక్కడ గంజాయి తోటలు ఉన్న విషయం తెలీదు. అంత గోప్యత పాటిస్తారు. ఇక గంజాయి పంట బాగా పండేందుకు ఎరుపు గులాబి వర్ణంలో ఉండే కాంతిని వినియోగిస్తారు. అందుకు సంబంధించిన లైట్లను మొక్కల మధ్య సెట్ చేస్తారు. అయితే రాత్రి సమయాల్లో ఈ లైట్లు వేసినప్పుడు చుట్టుపక్కల వాళ్లకు తెలియకుండా ఉండేందుకు మొక్కలను పెంచే ఎన్‌క్లోజర్స్‌ను నల్లని తెరలతో మూసేస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుపెట్టిన మొదటి వ్యక్తి.. నేటికీ చెరగని పాదముద్రలు
News Watch: KCR ముందస్తుకు వెళ్ళకపోవచ్చట !! ఇష్టాగోష్ఠిలో తమిళి సై ??