50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుపెట్టిన మొదటి వ్యక్తి.. నేటికీ చెరగని పాదముద్రలు
దాదాపు 50 ఏళ్ల క్రితం చంద్రుడిపైకి వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇప్పుడు అది నమ్మాల్సిందే..
దాదాపు 50 ఏళ్ల క్రితం చంద్రుడిపైకి వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇప్పుడు అది నమ్మాల్సిందే.. ఎందుకంటే..నాసా విడుదల చేసిన వీడియోలో మీరు ఇప్పటికీ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుజాలు కనిపిస్తున్నాయి. చంద్రుని ఉపరితలం చేరుకుని చరిత్ర సృష్టించిన అపోలో 11 వ్యోమగాముల మొదటి పాదముద్రలు నాసా విడుదల చేసిన వీడియోల్లో క్లియర్‌గా తెలుస్తున్నాయి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై నడిచిన మొట్ట మొదటి వ్యక్తి. ఆ అద్భుత ఘట్టానికి సంబంధించిన గుర్తులు యాభై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ చంద్రుడిపై చెక్కు చెదరకుండా ఉన్నాయి. చంద్రుని ఉపరితలంపై ఉన్న క్రేటర్లలో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూలై 20, 1960న నాసా ప్రయోగించిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ తీసిన ఫుటేజీలో వ్యోమగామి పాదముద్రలు ఉన్నాయి. జాన్ ఎఫ్. కెన్నెడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చంద్రుడిపైకి మానవ సహిత యాత్రకు ప్రణాళికను ప్రకటించారు. దీనిలో భాగంగా అపోలో 11 మిషన్‌కు నాయకత్వం వహించిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం తొలిసారిగా చంద్రుడిపై విజయవంతంగా కాలు మోపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: KCR ముందస్తుకు వెళ్ళకపోవచ్చట !! ఇష్టాగోష్ఠిలో తమిళి సై ??