Bear-child: ఎలుగుబంటిని వాటేసుకోబోయిన చిన్నారి..   ప్రాణాలకు తెగించి కాపాడిన త‌ల్లి..!(వీడియో)

Bear-child: ఎలుగుబంటిని వాటేసుకోబోయిన చిన్నారి.. ప్రాణాలకు తెగించి కాపాడిన త‌ల్లి..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jun 05, 2022 | 10:43 AM

తనకెంతో ఇష్టమైన జంతువు కళ్లముందు కనిపించగానే ఆ చిన్నారి దానిని హగ్‌ చేసుకోవాలనుకుంది. అది క్రూర జంతువు అని తెలియక అభం శుభం తెలియని ఆ చిన్నారి దాని వద్దకు పరుగెత్తింది. దూరం నుంచి అది గమనించిన చిన్నారి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి


తనకెంతో ఇష్టమైన జంతువు కళ్లముందు కనిపించగానే ఆ చిన్నారి దానిని హగ్‌ చేసుకోవాలనుకుంది. అది క్రూర జంతువు అని తెలియక అభం శుభం తెలియని ఆ చిన్నారి దాని వద్దకు పరుగెత్తింది. దూరం నుంచి అది గమనించిన చిన్నారి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను కాపాడుకుంది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వాషింగ్టన్‌లోని ఓ ఇంటి వెనుక గోడపైనుంచి దూకి ఇంట్లోకి చొరబడబోయింది ఒక ఎలుగు బంటి. ఆ ఇంట్లో డోర్‌ దగ్గర నిలబడి ఉన్న చిన్నారి దానిని చూసి ముచ్చటపడి హగ్‌ చేసుకోడానికి దాని దగ్గరకు వెళ్లబోయింది. వెంటనే ఆ చిన్నారి తల్లి అప్రమత్తమై ప్రాణాలకు తెగించి బిడ్డ ఎత్తుకొని ఇంట్లోకి పరుగెత్తి డోర్‌ లాక్‌ చేసింది. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. ఆ తల్లి సాహసానికి నెటిజన్లు హీరో మామ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా, త‌న కూతురు ఇటీవ‌లే యానిమ‌ల్ బుక్ చ‌దివింద‌ని, త‌న ఫేవ‌రెట్ యానిమ‌ల్ ఎలుగుబంటి అని చెప్పింద‌ని ఆ త‌ల్లి తెలిపింది. క్రూర జంతువుల గురించి త‌న‌కూతురికి వివ‌రిస్తాన‌ని చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 05, 2022 10:43 AM